- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ను ముస్లిం లీగ్, మావోయిస్టులతో పోలుస్తారా? మోడీపై వీహెచ్ ధ్వజం
కాంగ్రెస్‌ను MMC అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మోడీ కాంగ్రెస్‍ను ఉద్దేశించి MMC (ముస్లిం లీగ్ - మావోయిస్ట్ కాంగ్రెస్) అని సంబోధించడాన్ని తాజాగా ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (V. Hanumantha Rao) తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించి చరిత్ర కలిగిన పార్టీని ఇలాంటి పేర్లతో పిలవడం ప్రధాని పదవికి తగదని ఆయన విమర్శించారు. మావోయిస్టుల హింస వల్లే కారణంగానే ఇందిరా గాంధీ (Indira Gandhi), రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ప్రాణత్యాగం చేశారన్నారు. అలాంటిది మావోయిస్టులతో కాంగ్రెస్‌ను ముడిపెట్టడం అన్యాయం అన్నారు. ఇక దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు సైతం కీలక పాత్ర పోషించారని వారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రధాని వ్యాఖ్యలపై పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా పోలీసులను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. ఓబీసీలను కూడా కులగణనలో చేర్చకపోతే ఎవరూ ఈ జనగణనలో పాల్గొనవద్దని ఓబీసీలకు విజ్ఞప్తి చేశారు.






