- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు ఊహించని షాక్
కాళేశ్వరం నివేదిక(Kaleshwaram Report)పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) సచివాలయంలో జరిపిన కీలక సమావేశం ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం నివేదిక(Kaleshwaram Report)పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) సచివాలయంలో జరిపిన కీలక సమావేశం ముగిసింది. కాగా ఇటీవలే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్(PC Ghosh) తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కమిటీ సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు.
అయితే రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) అయ్యి కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో సీఎస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కమిషన్ ప్రభుత్వానికి పలు ముఖ్య సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అక్రమాలలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ల పాత్రపై ఉన్నట్టు తెలిపింది.
కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు కమిషన్ గుర్తించింది. ఇరిగేషన్ శాఖ పంపిన నివేదికలను పరిశీలించకుండానే ఆర్థికశాఖ గుడ్డిగా ఆమోదం తెలిపిందని కమిషన్ పేర్కొంది. నీటిపారుదలశాఖ, ఆర్థికశాఖలో భారీగా లోపాలు ఉన్నట్టు కూడా గుర్తించింది. పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుండగా.. కేబినెట్లో చర్చించిన అనంతరం నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది.






