- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleshwaram Project: దడపుట్టిస్తున్న ‘కాళేశ్వరం’ నివేదిక.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి
జస్టిస్ పి.చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పి.చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ స్పష్టంగా పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు కమిషన్ సిఫారసు చేసిన విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నివేదికలో సంచలన బయటకు వచ్చాయి.
బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతుల్లేవ్...
ప్రాజెక్టులో విధాన, ఆర్థిక పరంగా అవకతవకలు జరిగాయి కమిషన్ పెర్కొంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరగిందని రిపోర్టులో ప్రస్తావించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై.. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఏకంగా వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. తుమ్మడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్ధించుకున్నారని కమిషన్ ఆక్షేపించింది. తమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో ఏమాత్రం నిజాయితీ, చిత్తశుద్ధి చేపలేదని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుతులకు కేబినెట్ అనుమతులు లేవని నివేదికలో వెల్లడించారు. టర్న్ పద్థతిలో బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని సీడబ్ల్యూసీ సలహా ఇచ్చినా.. గంపగుత్తగా ఒకే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేశారని తెలిపారు.
ఉద్దేశపూర్వంగానే హరీశ్ ఆ విషయం పట్టించుకోలే..
కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బయటపెట్టింది. కేసీఆర్ ప్రమేయం, ఆదేశాలతోనే మూడు బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదికను హరీశ్ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేని అన్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త ఏర్పడిన రాష్ట్ర స్థితిగతులను ఈటల రాజేందర్ పట్టించుకోలేదని రిపోర్టులో కమిషన్ బహిర్గతం చేసింది.






