- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాడిదకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పిండితే రావు: CM రేవంత్
ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికే ఆదర్శం అని కొనియాడారు. నిజామాబాద్ రైతుల పోరాట స్ఫూర్తితో 2028లో ఫైట్ చేస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనపు నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ సూచనలతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. రేపు జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామని జోస్యం చెప్పారు. రాష్ట్రానికి నిజామాబాద్ గొప్ప నాయకులను అందించిందని గుర్తుచేశారు.
ధర్మపురి అర్వింద్ చేసిందేంటి?
నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్.. ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ చేయలేకపోయిన బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని అడిగారు. ధర్మపురి అర్వింద్‌తో పాటు మొత్తం బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. నిజామాబాద్ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా అర్వింద్ తీసుకురాలేకపోయాడని విమర్శించారు. ధర్మపురి అర్వింద్‌తో సహా ఏ ఒక్క బీజేపీ ఎంపీకి కూడా కేంద్ర నేతల దగ్గర బలంగా మాట్లాడే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీష్ రావును జైల్లో పెట్టాలని పదే పదే అర్వింద్ డిమాడ్ చేస్తున్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని అడిగారు. సీబీఐ ఎంక్వైరీకి తీర్మానం జరిగి ఆరు నెలలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ధర్మపురి అర్వింద్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐకి ఇస్తే.. కేసీఆర్‌ను 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడని మండిపడ్డారు. ధర్మపురి అర్వింద్‌కు ప్రధాని మోడీ దగ్గర పరపతి లేదు. ఆయన వల్ల జిల్లాకు కూడా ఏం ఉపయోగం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే.. అది తప్పకుండా వృథా అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాడిదకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పిండితే ఎలా వస్తాయని అడిగారు. మన బస్తీ, మన కాలనీ అభివృద్ధి జరుగాలంటే మనోడే గెలవాలని అన్నారు.






