- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్వకుంట్ల కిషన్‌రావుగా కిషన్‌రెడ్డి రూపాంతరం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్‌ది ఫెవీకాల్ బంధమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని చెప్పారు. కేసీఆర్‌ను కిషన్ రెడ్డే కాపాడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కిషన్ రావుగా కిషన్ రెడ్డి మారాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం. మన వాళ్లు కార్పొరేటర్లుగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది. నేను అందరివాడిని. నాకు కులం, మతం లేదు. నిజామాబాద్ జిల్లా గొప్ప నాయకులను అందించింది. మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిజామాబాద్ మురికి కూపంగా మారింది. ధర్మపురి అర్వింద్‌ను ఎంపీగా రెండు సార్లు గెలిపించినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయినా.. నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే ఒరిగేది ఏమీ లేదని అన్నారు.






