మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-19 05:15:57  IST  )

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది.

మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పునరుద్ధరించిన మేడారం వనదేవతల ఆలయాన్ని ఇవాళ(సోమవారం) సీఎం ప్రారంభించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఆదివాసీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మేడారం ఆలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి సమ్మక్క సారలమ్మలకు తొలి మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవతలకు పట్టువస్త్రాలు, పూలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం(Medaram)లోని సమ్మక్క-సారలమ్మ దేవతలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం.. తన మనవడు రేయాన్ష్‌తో కలిసి తులాభారం వేసుకుని, దేవతలకు ‘బంగారం’(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం పర్యటన అనంతరం భక్తులకు వనదేవతల దర్శనానికి అనుమతి లభించింది.

Read More..

మేడారంలో వనదేవతల గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Next Story