మేడారంలో వనదేవతల గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

by Malleboina Mahesh |   (  Updated:2026-01-19 05:17:43  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం వనదేవతలను దర్శించుకున్నారు.

మేడారంలో వనదేవతల గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడారం పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వనదేవతలను దర్శించుకున్నారు. మంత్రులతో కలిసి ఇటీవల సుమారు 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల (Sammakka-Saralamma Gaddelu) ప్రాంగణాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం వనదేవతల గద్దెల వద్ద తొలి మొక్కు సమర్పించిన సీఎం, తన మనవడితో కలిసి తులాభారంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

మొక్కులలో భాగంగా ముఖ్యమంత్రి తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని (నిలువెత్తు బంగారం) వనదేవతలకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళా తరహాలో మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా అభివృద్ధి పనులను పూర్తి చేశామని వెల్లడించారు. మేడారం పర్యటన ముగించుకున్న అనంతరం, పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరారు.

Read More..

మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం

Next Story