- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడిగడ్డలో CM రేవంత్ రెడ్డి పర్యటన: కుంగిన పిల్లర్ల పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లను ఆయన స్వయంగా పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన 7వ నంబర్ పిల్లర్‌తో పాటు పగుళ్లు ఇచ్చిన ఇతర ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు బ్యారేజీకి జరిగిన నష్టాన్ని, పునరుద్ధరణ పనుల పురోగతిని సీఎంకు వివరించారు. పర్యటన అనంతరం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కీలక భేటీ నిర్వహిస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు మరమ్మతు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం రాకముందే రక్షణ చర్యలు చేపట్టాలని, నిధుల కొరత లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.
కాటారంలో బహిరంగ సభ..
మేడిగడ్డ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి కాటారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదిక నుంచే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు భరోసా’ రెండో విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తున్న తరుణంలో, రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఈ పర్యటన ద్వారా సంకేతాలు ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.






