2027 తర్వాతే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-06 12:53:55  IST  )

తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పెంచుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రజా వేదికలపై అవకాశం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

2027 తర్వాతే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి 1400 కి.మీ మేర సాగిందన్నారు. నాడు ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని తాము అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇవాళ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు ఉన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అభివృద్ధిపైనే పార్టీలకు అతీతంగా పని చేస్తున్నామన్నారు.

అందుకే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు అవకాశం:

తమ సమస్యలు, ప్రశ్నలు లేవనెత్తి ప్రభుత్వం నుంచి పనులు సాధించుకునేలా చట్టసభల్లోనూ అవకాశం ఉండాలని బహిరంగ వేదికలపై కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను మాట్లాడిస్తున్నామన్నారు. ఈ సంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలనుకుంటున్నాం. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, పరస్పర గౌరవానికి ప్రతీక అని ఈ దేశానికి ఆదర్శంగా నిలబడేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఉందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అధికార పక్షం మీటింగ్ ఉంటే ప్రతిపక్ష నేతలను నిర్భందించేవారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. కొంత మంది మైక్ దొరికితే ఏం మాట్లాడుతున్నామో విచక్షణ కోల్పోయి మాట్లాడితే పేదలకు నష్టం జరుగుతుందన్నారు. పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం లేవనెత్తితే పరిష్కారం లభిస్తుందన్నారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి:

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు, పథకాలు మంజూరు చేస్తున్నామని అక్కడ మా ఎమ్మెల్యేలు లేకపోయినా అక్కడి ప్రజలు మావారు అని అన్నారు. బోథ్, నిర్మల్‍లో మా ఎమ్మెల్యేలు లేరని అయినా అక్కడ అభివృద్ధి ఆగడం లేదన్నారు. మా పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి చేస్తామని చెప్పడం లేదన్నారు. మేం పార్టీలు చూడకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని కానీ మేం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై..

కేంద్ర ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చవద్దని ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు వీటిలో మార్పులు అవకాశం లేదన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఓ జ్యుడిషియల్ కమిషన్ వేసి బోథ్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలనే డిమాండ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.

తొందరలోనే తమ్మిడి హెట్టి నుంచి ప్రాణహిత:

తొందరలోనే తమ్మిడి హెట్టి నుంచి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఆదిలాబాద్ ను నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేలు చేయిస్తున్నారు. అంచనాలు సిద్ధం అవుతున్నాయన్నారు.

ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టు:

తొందరలోనే ఆదిలాబాద్‍లో ఎయిర్ పోర్టు రాబోతోందన్నారు. వీలైతే జూన్ 2వ తేదీన శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతాని పర్యాటక ప్రాంతంగానే కాగు వేలాది ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయబోతున్నామ్నారు. త ద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ వేగంగా జరుగుతోందన్నారు. తొందరలోనే ఆదిలాబాద్‍లో యూనివర్సిటీ నిర్మించి ప్రారంభోత్సవానికి త్వరలోనే మళ్లీ వస్తానన్నారు. బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామన్నారు. దేశంలోనే బాసర ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి రెండు నెలలోకో సారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటానని వచ్చినప్పుడల్లా నిధులు తెస్తునే ఉంటామన్నారు.

రాక్షస పాలన మళ్లీ రాదు.. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు

Next Story