రాక్షస పాలన మళ్లీ రాదు.. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు

by Prasad Jukanti |   (  Updated:2026-04-06 12:50:30  IST  )

బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

రాక్షస పాలన మళ్లీ రాదు.. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'నాడు ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా చెప్పినట్లుగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశామని ఇప్పుడు పిప్రి వేదికగా తాను మళ్లీ చెబుతున్నాను వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ మన ప్రభుత్వమే రాబోతుంది' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మళ్లీ గడీల పాలన, రాక్షస పాలన రానివ్వమన్నారు. పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. 2034 వరకు మా ప్రభుత్వమే ఉంటుందన్నారు.

కొంచమైనా ఓపికుండాలి:

ప్రతిపక్షాలకు కొంచెమైనా ఓపిక ఉండాలి. సంయమనం పాంటించాలి. పదేళ్లు బీఆర్ఎస్ సృష్టించిన గందరగోళం, అప్పులను ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నాం. పదేళ్లు మీరు చేయలేని పనులు చేస్తుంటే కొంచెం ఆగకుండా విమర్శలు చేస్తారా అని బీఆర్ఎస్‍ను ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో మాట్లాడుదామంటే రారు. ఎంతసేపటికి లొల్లి పెట్టి యాగీ చేయడమే బీఆర్ఎస్ పని అని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టడమే బీఆర్ఎస్ పని అని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ సంగతేంటో చూశారని పదేళ్లు అధికారంలో ఉండగా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలు మాటలు మర్చిపోలేదు.

నాడు భార్యభర్తల ఫోన్లు విన్నారు:

ఆనాడు భార్యభర్తల ఫోన్లు కూడా విన్నారని కానీ ఇవాళ నడి రోడ్లపై మమ్మల్ని తిడుతున్నా మేము ఎవరిపై కేసులు పెట్టలేదు, సతాయించడం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని చెప్పారు. మళ్లీ జూన్ 2 లోపు ఆదిలాబాద్ కు వస్తానని హామీ ఇచ్చారు. 2030 లోపు ఆదిలాబాద్ అత్యధిక అభివృద్ధి చెందిన పర్యాటక, పారిశ్రామిక వాడ, విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

2027 తర్వాతే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story