జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-11 13:15:17  IST  )

జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన మరియు ధాన్యం కొనుగోళ్లపై మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జెమిని సర్కస్‍లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందని, ఎస్ఐఆర్‍ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ మీడియాతో చిట్‍చాట్‍లో మాట్లాడిన సీఎం.. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందన్నారు. పశ్చిమబెంగాల్‍లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ SIR ను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటీ అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‍ను దేనికి సంబంధం లేకుండా అమలు చేయడానికి అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయోచ్చు. నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్ సభ సీట్లను దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందన్నారు. 50 శాతం పెంపు అన్న దానికి కూడా ఇక ఫార్ములా లేదని సీట్ల పెంపకంపైనే అందరికీ అభ్యంతరాలు ఉన్నాయన్నారు.

కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదు:

బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని అతి పెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుందన్నారు. కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదన్నారు. ప్రభుత్వ స్కూల్స్ ఓపెనింగ్ రోజు పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం కోసం రాష్ట్ర గవర్నర్‍ను ఆహ్వానిస్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ఇంటర్ పైన తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తుమ్మడి హట్టి పై ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖ రాశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోడీకి నేను లేఖ రాశాననన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే బాగుంటుంది. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కోరుతున్నామన్నారు. ధాన్యం విపరీతంగా దిగుబడి వచ్చింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అకాల వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులున్నాయని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. పంట మార్పిడిపైన విస్రుత చర్చ జరగాల్సి అవసరం ఉందని క్షేత్రస్థాయిలో రైతులకు పంట మార్పిడిపైన వివరిస్తామన్నారు.

మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం.. ప్రధాని కామెంట్స్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్

Next Story