మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం.. ప్రధాని కామెంట్స్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్

by Prasad Jukanti |   (  Updated:2026-05-11 13:16:27  IST  )

ప్రధాని మోదీ మావోయిస్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని, 'హమ్ సే మిలో' పిలుపును స్వాగతిస్తున్నట్లు వెల్లడి.

మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం.. ప్రధాని కామెంట్స్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మావోయిస్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరం అని మావోయిస్టుల లొంగు బాటుపై మేం చొరవ తీసుకున్నామన్నారు. మనుషులను చంపడం పరిష్కారం కాదని, మనుషుల ప్రాణాల విలువ మాకు తెలుసు అన్నారు. ఇవాళ మీడియాతో చిట్‍చాట్‍లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఏ సమస్యలపై కొట్లాడారో మేం వాటిపై చట్టాలు చేశామన్నారు. సమస్యలు తగ్గడం వల్లే మావోయిస్టులు తగ్గిపోయారని బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం చెప్పామని చివరకు మావోయిస్టులు మా దారికి వచ్చారన్నారు.

అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే ఉచిత సలహాలు

మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశంలో భాగస్వాములు. ముస్లింలను వేరు చేసి చూపించడం మంచింది కాదన్నారు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఇదే బీజేపీ విధానం, వివక్ష అని విమర్శించారు. కాంగ్రెస్ హాయంలోనే బీజేపీ ఎదిగందని బీజేపీ ప్రమాదకరమని మేం చెప్పామా? అని ప్రశ్నించారు. అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే మోడీ ఉచిత సలహాలు ఇస్తున్నారని దేశ ప్రజలపై అప్రకటిత నిషేధం కొనసాగుతోందన్నారు. రాహుల్ గాంధీ 6 నెలల క్రితమే వీటన్నింటిపై చెప్పారన్నారు.

మోడీ పిలుపును స్వాగతిస్తున్న:

నిన్న ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, 'హమ్ సే మిలో' అంటూ తమతో కలిసి రావాలన్న ప్రధాని పిలుపును స్వాగతిస్తున్నానన్నారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదన్నారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలన్నారు. మా పార్టీలు, ఐడియాలజీ వేరైనా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. ఎన్నో సార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని 2 గంటలు సమయమిస్తే మా ప్రణాళికను ప్రధానికి వివరిస్తానన్నారు. మెట్రో పాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరానని

జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story