- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: అడిగిందేంటి? ఇచ్చిందేంది? కేంద్ర బడ్జెట్ పై సీఎం ఆగ్రహం
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో (Command Control Room) డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. బడ్జెట్ (Union Budget 2025-26)లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగింది ఏంటి? వాళ్లు ఇచ్చింది ఏంటి?’ అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు మంత్రులతో ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పని చేయాలని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంపై స్పీడ్ పెంచడంతోపాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ఇంటర్ బోర్డుపై సీరియస్..
రాష్ట్రంలో ఇంటర్ బోర్డు (Inter Board) వర్సెస్ ప్రైవేటు జూనియర్ కాలేజీల వ్యవహారంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పరీక్షల సమయంలో ఇదేం పంచాయతీ అని అధికారులపై మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రైవేట్ కాలేజీలతో చర్చలు జరిపి ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కు సెంటర్లు ఇవ్వాలని కోరారు. ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని ప్రైవేట్ కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే వార్షిక పరీక్షలకు కాలేజీలను ఎగ్జామ్ సెంటర్లుగా ఇవ్వబోమని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం తేల్చిచెప్పింది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఎల్లుండి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఇంటర్ బోర్డు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
Also Read...
రాష్ట్ర ప్రజల తరఫున ఆర్థిక మంత్రికి నా ధన్యవాదాలు: కేంద్ర మంత్రి






