- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజల తరఫున ఆర్థిక మంత్రికి నా ధన్యవాదాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో పలు కేటాయింపులు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget 2025) పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి బడ్జెట్ లో పలు కేటాయింపులు చేశారు. దీంతో రాష్ట్ర ప్రజల తరపున రామ్మోహన్ నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ పై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడని ఇందులో భాగంగా జల్ జీవన్ పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ రోజు బడ్జెట్ లో 2028 వరకు జల్ జీవన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించడం శుభ పరిమాణం అని.. ఈ నిర్ణయం ఏపీకి మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
అలాగే గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జల్ జీవన్ నిధులు (Jal Jeevan Funds) దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అలాగే కేంద్రంలో ఉన్న తామంతా.. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామని చెప్పుకొచ్చారు. కలిసికట్టుగా పనిచేసి.. రాష్ట్రానికి ఎంత వీలైతే అంత మొత్తంలో నిధులు తెస్తామని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా.. దేశంలో, రాష్ట్రంలో పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలోనే బడ్జెట్‌లో వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్టెట్ మొత్తం రూ. 50,65,345 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వసూళ్లు రూ. 34,20,409 కోట్లు, మూల ధన వసూళ్లు రూ. 16,44,936 కోట్లు, అప్పులు, ఇతర వసూళ్లు రూ. 15,68,936, GDP లో ఆర్థిక లోటు 4.8 శాతం, ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం రూ.42. 70 లక్షల కోట్లు, రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్ను వసూళ్లు రూ. 28.37 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 5.83 లక్షల కోట్లు, 2025-26 ద్రవ్యలోటు 4.4 శాతంగా అంచనా వేశారు.






