మీర్జాగూడ ప్రమాదంలో 17కి చెరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

by Malleboina Mahesh |   (  Updated:2025-11-03 04:04:06  IST  )

రంగారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టిన ఈ ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు

మీర్జాగూడ  ప్రమాదంలో 17కి చెరిన మృతుల సంఖ్య..  సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టిన ఈ ప్రమాద ఘటనలో 17 మంది మృతి (17 people died) చెందారు. మీర్జా గూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఈ భయానక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం అందుతుండగా.. టిప్పర్ లారీ (Tipper lorry)లోని కంకర బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అలాగే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ప్రాణాలు కోల్పోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy,), పొన్న ప్రభాకర్ స్పందించి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌, డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచన.. అత్యవసర వైద్య సాయంతో పాటు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

మీర్జాగూడ రోడ్డుప్రమాదం బాధాకరం : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. ఏకంగా 15 మంది దుర్మరణం

Next Story