- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీర్జాగూడ రోడ్డుప్రమాదం బాధాకరం : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ అతివేగంతో ఢీ కొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ - బీజాపూర్ హైవే పై తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో లారీలో ఉన్న కంకర అంతా బస్సులో పడటంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. జేసీబీ సహాయంతో కంకరను తొలగించగా అప్పటికే పలువురు ప్రయాణికులు మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మరణించారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం 15 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు.
ఈ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టిప్పర్ లో ఉన్న కంకర బస్సులో పడటంతో ప్రయాణికులు మరణించినట్లు వెల్లడించారు. ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. టిప్పర్ మితిమీరిన వేగంతో రావడం వల్ల మలుపులో డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీ కొట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు పలువురు ప్రయాణికులను బయటకు లాగి రక్షించారు.
Read More..
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. ఏకంగా 15 మంది దుర్మరణం






