SIR ప్రక్రియ‌లో నేతల పెర్ఫార్మెన్స్ పూర్.. సీఎం రేవంత్ ఫైర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-29 14:33:33  IST  )

నేడు గాంధీ భవన్‌లో పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సామవేశం అయ్యింది. ఈ సమావేశం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగ్గా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు.

SIR ప్రక్రియ‌లో నేతల పెర్ఫార్మెన్స్ పూర్.. సీఎం రేవంత్ ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు గాంధీ భవన్‌లో పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సామవేశం అయ్యింది. ఈ సమావేశం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగ్గా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో SIR ప్రక్రియపై చర్చ జరిగింది. అయితే SIR ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది. SIR ప్రక్రియలో పర్ఫామెన్స్ సరిగ్గాలేని నేతలను రేవంత్ రెడ్డి ఎందుకు వెనుకబడ్డారో క్లారిటీ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ ప్రక్రియలో హైదరాబాద్ పెర్ఫామెన్స్ కూడా పూర్ గా ఉండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇవ్వాలని అడిగారు. దీంతో త్వరలోనే కమిటీ వేసి పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామన్న పొన్నం వివరణ ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ, డివిజన్ వారిగా కమిటీలు వేయాలని సీఎం రేవంత్ నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు క్లస్టర్ మీటింగ్‌లు పెట్టాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సూచించారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో SIRతో బీజేపీ ఎన్నికల కమిషన్ ను చేతిలో పెట్టుకుని వేల సంఖ్యలో ఓట్లు తొలగించింది అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను వ్యతిరేఖిస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ముందు నుండి దీనిని వ్యతిరేకిస్తూనే ఉంది.

మాజీ మంత్రి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం

Next Story