మాజీ మంత్రి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-29 14:34:24  IST  )

మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

మాజీ మంత్రి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి మరణం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో తన ఇంట్లో ఆయన కన్నుమూయగా.. పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గాదె వెంకట్ రెడ్డి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. గాదె వెంకట్ రెడ్డి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లోనూ వెంకట్ రెడ్డి తన సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

SIR ప్రక్రియ‌లో నేతల పెర్ఫార్మెన్స్ పూర్.. సీఎం రేవంత్ ఫైర్

Next Story