- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు’: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, దేశ రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, దేశ రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. "మహిళా రిజర్వేషన్లను సులభంగా అమలు చేయవచ్చు. కానీ బీజేపీ తలుపులు మూసుకుని నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత మద్దతు అడగడం ఏంటి?" అని ప్రశ్నించారు. 2/3 వంతు మెజారిటీ లేదని తెలిసి కూడా బిల్లు పెట్టడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, బీజేపీ తన శిఖండి రాజకీయాలను మానుకోవాలని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలను రిఫరెండంగా తీసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రాముడు కూడా బీజేపీని ఓడించాడు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయి సమాజ్ వాదీ పార్టీ గెలవడమే దీనికి నిదర్శనం" అని ఎద్దేవా చేశారు. బాగా పనిచేసే రాష్ట్రాలను శిక్షించే అధికారం కేంద్రానికి లేదని, నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికనే కాకుండా 50 శాతం మెరిట్ ప్రాతిపదికన కూడా జరగాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ దేవుడి మీద ఒట్టు వేయాలి..
బీఆర్ఎస్ వైఖరిపై స్పందిస్తూ, ఎమ్మెల్సీ కవిత అడుగుతున్న ప్రశ్నలకు ముందు కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. "బీజేపీతో కలవనని కేసీఆర్ తాను నమ్మే దేవుడి మీద ఒట్టు వేసి చెప్పగలరా?" అని సవాల్ విసిరారు. మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ వంటి కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "మా ఎంపీల గొంతు బీఆర్ఎస్ వెధవలకు వినిపించడం లేదా? వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు" అంటూ ఘాటుగా స్పందించారు. మొత్తంగా, రాజ్యాంగ సవరణలు, ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్రాల హక్కులను కాలరాసేలా బీజేపీ వ్యవహరిస్తోందని, దీనిని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం శారు.






