తేజస్వీ సూర్య ఓ వెధవ.. బీజేపీ ఎంపీలు దద్దమ్మలు.. కేసీఆర్ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2026-04-27 11:38:39  IST  )

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తేజస్వీ సూర్య   ఓ వెధవ..  బీజేపీ ఎంపీలు దద్దమ్మలు.. కేసీఆర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో చండాలమైన, చిల్లర ప్రభుత్వం నడుస్తోందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. లోక్‍సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పెద్ద వెధవ అని ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదన్నారు. కాంగ్రెస్ వెధవలు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఘాటు విమర్శలు చేశారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లమని తెలంగాణ పట్ల బీఆర్ఎస్‍కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికి ఉండదన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

అందుకే చంద్రబాబుతో పొత్తు:

తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో సందర్భంలో నన్ను మానసిక క్షోభకు గురి చేశారని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గమని సోనియాగాంధీ 16 సార్లు చెప్పారని, హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ విషయం త్వరగా తేలుతుందని సోనియా గాంధీ నాతో చెప్పారన్నారు. కానీ నేను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైదరాబాద్‍తో కూడిన తెలంగాణ కావాలని అప్పట్లో గట్టిగా కొట్లాడి సాధించామన్నారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే నాడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదని బొందల పడ్డట్టు అయిందని తెలంగాణా ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ విగ్రహాన్నీ చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదన్నారు.

‘వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు’: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Next Story