- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Gaddar Film Awards 2024: అల్లు అర్జున్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించిన CM రేవంత్
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతోన్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల(Telangana Gaddar Awards) ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతోన్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల(Telangana Gaddar Awards) ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు. స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అయితే.. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో అల్లు అర్జున్‌పై కేసు నమోదు కావడంతో ఒకరోజు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ టార్గెట్ చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మరీ ఆలింగనం చేసుకోవడంతో ఈ వార్తలన్నింటికీ పుల్‌స్టాప్ పడినట్లయింది. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసింది. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ, సుకుమార్, రాజమౌలి, నాగ్‌అశ్విన్‌లు కూడా హాజరయ్యారు.
Read More :
‘గంగమ్మ జాతరలో యాట తల నరికినట్లు నరుకుతా’...CM రేవంత్ రెడ్డి ఎదుట రెచ్చిపోయిన అల్లు అర్జున్






