దేశంలో కొత్త వాటర్, పవర్ పాలసీ తీసుకొస్తాం: KCR

by Disha Web Desk 2 |
దేశంలో కొత్త వాటర్, పవర్ పాలసీ తీసుకొస్తాం: KCR
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాల మధ్య జరుగుతోన్న జల వివాదాలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. నాందేడ్ బహిరంగ సభ అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో కొత్త వాటర్ పాలసీ, కొత్త పవర్ పాలసీ తీసుకొస్తామని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునళ్ల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. దాదాపు నాలుగు దశాబ్దాలు దాటినా దేశంలో నీటి సమస్య సమసిపోలేదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేసియా అద్భుతాలు సృష్టిస్తున్నాయని అన్నారు. భారత్‌లో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదని అన్నారు. రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే దేశమంతా ఉచిత విద్యుత్ అందించొచ్చు అని అన్నారు. రైతులను విస్మరించి కేవలం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more:

కేంద్రంపై మరోసారి రెచ్చిపోయిన సీఎం కేసీఆర్...నాందేడ్ బహిరంగ సభలో బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed