గంజాయి రహిత జిల్లాగా ప్రకటించాలి : ఎస్పీ స్నేహ శ‌బ‌రీష్

by Ratna Kumari |

మానుకోట జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని మహబూబాబాద్ ఎస్పీ స్నేహ శబరీష్ అన్నారు.

గంజాయి రహిత జిల్లాగా ప్రకటించాలి : ఎస్పీ స్నేహ శ‌బ‌రీష్
X

దిశ‌, మ‌హ‌బూబాబాద్ టౌన్ : మానుకోట జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని మహబూబాబాద్ ఎస్పీ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గురువారం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో యువత గంజాయి మత్తుకు బానిస కావద్దని తెలిపారు. యువత సన్మార్గంలో నడిచి బావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి ఇతర మారక దవ్యాలకు అలవాటు కావద్దని హిత‌వు పలికారు. ఎవరైనా అక్రమంగా తరలించిన, సేవించినా మత్తుకు బానిసైన పోలీసుల‌కు తెలియజేయాల‌ని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు. ఎలాంటి సమస్యలున్న నేరుగా తనను కలవచ్చని జిల్లా ప్రజలకు ఆయన భరోసా కల్పించారు.

తండాలలో, గ్రామాలలో, మండలలో వివిధ ప్రాంతాలలో ఎలాంటి అసంఘిక కార్యక్రమాలకు పాటు పడితే మాకు తెలియపరచాలని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎలాంటి అనుమానాలు ఉన్న నేరుగా మాకు తెలియపరచాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత చెడు బారిన పడకుండా సన్మార్గంలో నడిచి చదువుపై శ్రద్ధ పెద్యాల్సిన బాధ్యత ఉందన్నారు. వీటికి సంబంధించిన గిట్లను ఆయన విడుదల చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డిఎస్పి తిరుమలరావు, తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్, డోర్నకల్ సీఐ చంద్రమోహన్, మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ రఘుపతి రెడ్డి, మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, మరిపెడ సిఐ పవన్ కుమార్, గూడూరు సిఐ వినయ్ కుమార్, మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ ఉమా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story