- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’.. ఎస్సై వీరేందర్ కీలక సూచనలు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చింతకాని మండల పరిధిలోని వందనం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో చింతకాని పోలీసుల ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల నివారణ, గంజాయి(మత్తు పదార్థాల) నిర్మూలన మరియు సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

దిశ, చింతకాని: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చింతకాని మండల పరిధిలోని వందనం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో చింతకాని పోలీసుల ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల నివారణ, గంజాయి(మత్తు పదార్థాల) నిర్మూలన మరియు సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై వీరేందర్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని,ఆన్‌లైన్ మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయకులను బురిడీ కొట్టిస్తూ డబ్బులు కాజేస్తున్నారన్నారు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని, ఏదైనా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదన్నారు. గంజాయి మరియు ఇతర మత్తుపదార్థాల వాడకం వల్ల యువత భవిష్యత్తు అంధకారమవుతోందన్నారు.
విద్యాసంస్థలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గంజాయి దందా పెరిగిపోతోందని దీనివల్ల యువత ఆరోగ్యం క్షీణించి, చదువును మధ్యలోనే ఆపేయడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం జరుగుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలన్నారు. గంజాయికి బానిసైన యువతకు నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి, డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడానికి క్రీడలు, యోగా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వైపు మళ్లించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అతి వేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు, మద్యం వంటి పరధ్యానాలకు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్,సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






