- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను గురువారం సీఐ రామ్ లాల్ తన సిబ్బంది వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు.

దిశ, మక్తల్ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను గురువారం సీఐ రామ్ లాల్ తన సిబ్బంది వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటనను అడ్డుకుంటారని ముందస్తు సమాచారంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని గృహ నిర్భంధం చేసి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితుల తరపున భూత్పూర్ జలాశయం నుంచి అక్రమంగా నీళ్లు తీసుకుని కొడంగల్ - మక్తల్ నియోజకవర్గం రైతుల నోటిలో మట్టి కొట్టి కొడంగల్ కి పైపులైన్ ల ద్వారా నీళ్లు తీసుకెళుతున్నారని.. గ్రావిటీ కేనెల్ ద్వారా తీసుకెళ్లడం లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తల నాయకులతో ఆందోళన చేపడతారని ముందస్తు సమాచారంతో వారిని హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో నవిద్ ఫాష, వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మి రెడ్డి, ఎస్ఐలు , సిబ్బంది ఉన్నారు.






