గండికోటలో ‘రణబాలి’ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్!

by Mallepaka Hamsa |

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన గండికోటలో ‘రణబాలి’ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది.

గండికోటలో ‘రణబాలి’ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లైన తర్వాత జంటగా నటిస్తున్న సినిమా ‘రణబాలి’. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక సంఘటనలతో పాటు, బ్రిటిష్ వారిని ఎదిరించిన ఒక నిర్భయ యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నారు. ఈసినిమాను సెప్టెంబర్ 11న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ‘రణబాలి’ షూటింగ్ రాయలసీమ ఖిల్లాలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన గండికోటలో ‘రణబాలి’ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు, రాయలసీత చారిత్రక బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో గండికోటలోని చారిత్రక కట్టడాలు.. పర్‌ఫెక్ట్ అని అక్కడ లోకేషన్లను సెలెక్ట్ చేసుకున్నారు చిత్రబృందం. గండికోట ముఖద్వారం, ధాన్యాగారం వద్ద భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారట. గుర్రపు స్వారీ చేస్తూ విజయ్ శత్రువులను వేటాడే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌కు హైలెట్ అని తెలుస్తోంది. ఇప్పటికే కర్నుల్ నంద్యాల జిల్లాల్లో షూటింగ్ జరుపుకోగా.. ఇప్పుడు గండికోట షెడ్యూల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గుర్రపు స్వారీ చేస్తున్న విజయ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Next Story