- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ileana: నేను నటించిన వారిలో ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే చాలా ఇష్టం
ఇలియానా తనకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి, ఆయనతో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుందని వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా, దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, ఇలియానా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించిన ఈమె అనంతరం పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా ఇతర భాషా సినిమాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నించింది.
ప్రారంభంలో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అవకాశాలు క్రమంగా తగ్గాయి. ప్రస్తుతం ఈమె అడపాదడపా హిందీ సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తోంది. కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానాకు “మీకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె, జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పింది. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉంటారు. సెట్లో ఆయన ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది” అని ఇలియానా తెలిపింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రాఖీ మంచి విజయాన్ని అందుకోగా, శక్తి మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.






