బొల్లా బ్రహ్మనాయుడు పిటిషన్‌: తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-04 08:35:31  IST  )

తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది...

బొల్లా బ్రహ్మనాయుడు పిటిషన్‌: తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు(Former MLA Bolla Brahmanaidu) ముందస్తు బెయిల్ పిటిషన్‌(Anticipatory bail petition)పై విచారణ జరిగింది. దాదాపు రూ.1500 కోట్ల విలువైన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై నార్సింగి పోలీసులు(Narsingi Police) ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన కోర్టును ఆశ్రయించారు.

నార్సింగి పోలీసులకు నోటీసులు

ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై స్పందించాలని నార్సింగి పోలీసులకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు వివరాలు, పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈనెల 11వ తేదీకి వాయిదా

ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story