ప్రభుత్వ ఉద్యోగార్థులకు సుప్రీంకోర్టు ఝలక్.. ఖాళీల భర్తీ నిబంధనలపై చారిత్రాత్మక తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-04 12:05:06  IST  )

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

ప్రభుత్వ ఉద్యోగార్థులకు సుప్రీంకోర్టు ఝలక్.. ఖాళీల భర్తీ నిబంధనలపై చారిత్రాత్మక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు (Government Job Recruitments) సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సెన్సేషనల్ తీర్పును వెలువరించింది. ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన సమయంలో అమల్లో ఉన్న పాత నిబంధనల ప్రకారమే ఆ ఖాళీలను భర్తీ చేయాలనే యూనివర్సల్ రూల్అను ఏదీ లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. మారుతున్న కాలం, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేసే పూర్తి హక్కు ప్రభుత్వాలకు ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది.

రంగయ్య కేసు తీర్పు యూనివర్సల్ రూల్ కాదు..

గతంలో ఉన్న ‘వైవీ రంగయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1983)’ కేసు తీర్పును ఆధారంగా చేసుకుని.. ఖాళీలు ఏర్పడినప్పటి పాత రూల్స్ ప్రకారమే రిక్రూట్‌మెంట్ జరగాలని ఉద్యోగార్థులు కోర్టులను ఆశ్రయించే వారు. అయితే, ఈ రంగయ్య కేసు తీర్పు అన్ని పరిస్థితులకు వర్తించదని, అది సార్వత్రిక నియమం కాదని సుప్రీంకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం నియామక నిబంధనలను సవరించేలా, మార్చే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఖాళీలు పాతవైనంత మాత్రాన, కొత్త రూల్స్‌ను పక్కన పెట్టలేమని స్పష్టం చేసింది. కేవలం నోటిఫికేషన్ (Notification) రాక ముందే ఖాళీ ఏర్పడినంత మాత్రాన, సదరు అభ్యర్థికి పాత నిబంధనల ప్రకారమే ఉద్యోగం, ప్రమోషన్ పొందాలనే నిరుపాధిక హక్కు లభించదని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామక ప్రక్రియలలో పాత నిబంధనల వివాదాల వల్ల నిలిచిపోయిన ఎన్నో కోర్టు కేసులకు శాశ్వత పరిష్కారాన్ని చూపనుంది. ఇది ప్రభుత్వాలకు రిక్రూట్‌మెంట్ నిబంధనల సవరణలో మరింత పారదర్శకతను, స్వేచ్ఛను ఇవ్వనుందని పలువురు పేర్కొన్నారు.

Next Story