పారా అథ్లెట్లు సమాజానికి స్ఫూర్తిదాయకం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సవాళ్లను అవకాశాలుగా మలచుకుని అద్భుత విజయాలు సాధిస్తున్న పారా అథ్లెట్లు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల అన్నారు.

పారా అథ్లెట్లు సమాజానికి స్ఫూర్తిదాయకం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సవాళ్లను అవకాశాలుగా మలచుకుని అద్భుత విజయాలు సాధిస్తున్న పారా అథ్లెట్లు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల అన్నారు. గురువారం నగరంలో జరిగిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ‘ప్రెజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన గవర్నర్, వారి శిక్షణా విధానాలను ఆసక్తిగా పరిశీలించారు. క్రీడలు, శిక్షణ ద్వారా దివ్యాంగులకు సాధికారత కల్పిస్తున్న ఫౌండేషన్ కృషిని ఆయన ప్రశంసించారు. అద్భుత ప్రతిభ కనబరిచిన పారా సైక్లిస్టులు శివాని, జ్యోతి, షేక్ అర్షద్, లీషా దాస్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ.. వారు దేశానికే గర్వకారణమని కొనియాడారు. సమాజంలో అందరినీ కలుపుకుపోవడం అనేది కేవలం ఒక విధానం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గవర్నర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story