విజ‌య్ ఇందిర చిల్ట్ర‌న్ ఆసుప‌త్రిలో వైద్య శిబిరం విజ‌య‌వంతం : స‌ర్పంచ్ కందమల అనూష

by Ratna Kumari |

మండల ప‌రిధిలోని జూపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ కందమల అనూష జగపతి ఆధ్వర్యంలో విజయ్స్ ఇందిర పిల్లల ఆసుపత్రి నిర్వ‌హించిన‌ ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయిందని సర్పంచ్ కందమల అనూష జగపతి తెలిపారు.

విజ‌య్ ఇందిర చిల్ట్ర‌న్ ఆసుప‌త్రిలో వైద్య శిబిరం విజ‌య‌వంతం : స‌ర్పంచ్ కందమల అనూష
X

దిశ, చారకొండ : మండల ప‌రిధిలోని జూపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ కందమల అనూష జగపతి ఆధ్వర్యంలో విజయ్స్ ఇందిర పిల్లల ఆసుపత్రి నిర్వ‌హించిన‌ ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయిందని సర్పంచ్ కందమల అనూష జగపతి తెలిపారు. ఈ సంద‌ర్భంగా సర్పంచ్ కందమల అనూష జగపతి మాట్లాడుతూ జూపల్లి గ్రామం, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు వారి పిల్లల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉచిత వైద్య శిబిరం వినియోగించుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాలు పేద పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేని ఎంతో మందికి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సర్పంచ్ గ్రామ ప్రజలకు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో సుమారు 70 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో విజయ్స్ ఇందిర పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి డాక్టర్లు ఎల్. అర్జున్ చౌహన్, డాక్టర్ గోపాల్ కృష్ణ, హాస్పిటల్ అడ్మిన్ భాస్కర్ రెడ్డి, సిబ్బంది, గ్రామ వార్డ్ మెంబర్స్, రాములు యాదవ్, తిరుపతయ్య, శ్రీరాములు, బాలరాజు, విజయ్, ప్రజలు పాల్గొన్నారు.

Next Story