- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేడిగాలులు డయాబెటిస్ రిస్క్‌ను మరింత పెంచుతాయా?
వేడిగాలులు డయాబెటిస్ వల్ల కలిగే అనారోగ్యాలను మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : వేసవి కారణంగా ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయి? అయితే ఇలాంటప్పుడు డయాబెటిక్ బాధితులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే హీట్‌వేవ్ వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు మారవచ్చు. పైగా వీరు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడంవల్ల శరీరంలో నీటిశాతం పడిపోయి డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిని మరింత పెంచి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు వేడిగాలుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ప్రమాదకర లక్షణాలు
వేడిగాలులు డీహైడ్రేషన్ రిస్క్‌ను పెంచడంతోపాటు డయాబెటిస్ బాధితల్లో నరాలను దెబ్బతీస్తాయని, చెమట పట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో శరీరం సరిగ్గా చల్లబడలేక, హీట్ స్ట్రోక్ లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకే హీట్ వేవ్‌లో డయాబెటిస్ బాధితులు కొన్ని లక్షణాలు లేదా సంకేతాలను బట్టి వెంటనే అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా చెమట పట్టకపోవడం, చర్మం వేడిగా, పొడిగా ఉండటం, తీవ్రమైన దాహం, నోరు పొడిబారిపోవడం, యూరిన్ రంగు మారడం, మైకం, గుండె వేగంగా కొట్టుకోవడం, బలహీనత, గందరగోళం, వణుకు (లో బ్లడ్ షుగర్ లాగా), వాంతులు, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వంటివి హీట్ స్ట్రోక్ లక్షణాలుగా అనుమానించాలి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
హీట్ వేవ్‌లో డయాబెటిస్‌ను నియంత్రించడానికి ముందు జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా దాహం కోసం ఎదురు చూడకుండా రోజంతా తగినంత నీళ్లు తాగాలి. షుగర్ బాధితులు కాఫీ, టీ, ఆల్కహాల్ వంటివి మానేయాలి. బ్లడ్ షుగర్‌ను సాధారణం కంటే ఎక్కువసార్లు చెక్ చేయాలి. ఇన్సులిన్, టెస్ట్ స్ట్రిప్స్‌ను చల్లగా (వేడికి దూరంగా) ఉంచాలి. పగటి పూట ఎక్కువ వేడి ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లడం సురక్షితం. హీట్‌వేవ్ వల్ల ప్రమాదకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, వ్యక్తిగత సలహా తీసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం, వైద్యుడి సూచనలు పాటించడం ద్వారా హీట్ వేవ్‌ను సురక్షితంగా ఎదుర్కోవచ్చు.






