- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరం బ్యాక్‌వాటర్ ముంపు పై సమగ్ర సర్వే.. పీపీఏ అధికారుల హామీ
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ (వెనుక జలాలు) కారణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల్లో త్వరలోనే సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు వెల్లడించారు.

దిశ, బూర్గంపాడు : పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ (వెనుక జలాలు) కారణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల్లో త్వరలోనే సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు వెల్లడించారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌లో బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో గురువారం అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు పీపీఏ అధికారులను కలిశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల బూర్గంపాడు గ్రామానికి పొంచి ఉన్న ముప్పును, స్థానిక ప్రజల ఆందోళనలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారు.
సర్వే ద్వారా ముంపునకు గురయ్యే గ్రామాలను పూర్తిగా గుర్తించి, ఆ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ప్రత్యామ్నాయాలపై కూడా నివేదికలో స్పష్టమైన ప్రతిపాదనలు పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భజన పెదనాగం, తోకల శ్రీనివాస్, అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు లక్కోజి విష్ణువర్ధన్, కేవీ రమణ, కైపు శ్రీనివాసరెడ్డి, గుద్దేటి ప్రవీణ్ కుమార్, వీవీబీ చారి, ఆశిక్ (లైక్ సార్), దన్సీరాం పున్నంచంద్, హరినాథ్, గూడూరు వెంకన్న, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మున్నా తదితరులు పాల్గొన్నారు.






