- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామిళ్లపల్లి దాడి ఘటనపై YCP సీరియస్.. NHRCకి ఫిర్యాదు
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ని వైసీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఢిల్లీలో కమిషన్ ఛైర్మన్‌ను అంబటి మురళి నేతృత్వంలో వైసీపీ ఎంపీ డాక్టర్ తనూజారాణి, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కలిశారు...

దిశ, వెబ్ డెస్క్: జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ని వైసీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఢిల్లీలో కమిషన్ ఛైర్మన్‌ను అంబటి మురళి నేతృత్వంలో వైసీపీ ఎంపీ డాక్టర్ తనూజారాణి, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కలిశారు. ఏపీలోని మామిళ్ళపల్లి గ్రామంలో జరిగిన దాడి ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు కూడా ప్రతినిధులతో పాటు వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి.
తక్షణమే రక్షణ కల్పించాలి
కాగా మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతులపై జరిగిన దాడి ఘటనను వైసీపీ తీవ్రంగా పరిగణించింది. గ్రామంలోని రైతులపై జరిగిన హింస, వారి హక్కుల ఉల్లంఘనను NHRCకి వివరించిన ప్రతినిధులు, తక్షణమే బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
స్వతంత్ర విచారణ జరిపాలి..
ఈ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలను, బాధితుల ప్రస్తుత పరిస్థితిని ప్రతినిధుల బృందం మానవ హక్కుల కమిషన్‌కు నివేదించింది. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్వతంత్ర విచారణ జరిపించి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషన్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.






