చంద్రమోహన్ మృతి పట్ల CM KCR సంతాపం

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-11 07:48:08  IST  )

ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.

చంద్రమోహన్ మృతి పట్ల CM KCR సంతాపం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని.. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More..

చంద్రమోహన్‌ను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగ్ వచ్చేది: పవన్ కల్యాణ్

చంద్రమోహన్ అకాల మరణం బాధాకరం.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషన్ పోస్ట్

Next Story