చంద్రమోహన్ అకాల మరణం బాధాకరం.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషన్ పోస్ట్

by Disha Web Desk 6 |
చంద్రమోహన్ అకాల మరణం బాధాకరం.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషన్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్ర మోహన్ (82) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్, జగన్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా, ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ ట్వీట్లు చేశారు. ‘‘ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను’’ అని తారక్ రాసుకొచ్చాడు. అలాగే కళ్యాణ్ రామ్ ‘‘విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని రాసుకొచ్చాడు.

Read More..

చంద్రమోహన్‌ను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగ్ వచ్చేది: పవన్ కల్యాణ్

వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్‌.. ఎక్కడెక్కడ ఎంత ఉండేదంటే?

Next Story

Most Viewed