- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐడీ షాక్: పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు సీఐడీ (CID) అధికారులు నోటీసులు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు సీఐడీ (CID) అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జనవరి 29వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమ్మక్క-సారక్క జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారి పట్ల అగౌరవంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
సీఐడీ రంగ ప్రవేశం..
మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును, ప్రభుత్వం తదుపరి విచారణ నిమిత్తం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించి, ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు. ఏప్రిల్ 4న జరిగే విచారణలో కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోనున్నారు. గత కొంతకాలంగా అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్న కౌశిక్ రెడ్డికి ఈ నోటీసులు రావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇది కక్షపూరిత చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు: కౌశిక్ రెడ్డి






