ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు: కౌశిక్ రెడ్డి

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-31 06:42:34  IST  )

సీఐడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు.

ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు: కౌశిక్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సీఐడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘‘ఏ తప్పు చేయకపోయినా.. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో ఇలా నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురిచేయడం సరికాదు. రాజకీయాలు నాపై చేయండి.. కానీ నా కుటుంబాన్ని, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం?. రేవంత్ రెడ్డి గారు.. నన్ను లక్ష్యంగా చేసుకోండి.. నాపై కేసులు పెట్టండి.. నాకు నోటీసులు ఇవ్వండి.. కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు.. ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు.. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని ట్వీట్‌లో కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

సీఐడీ షాక్: పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Next Story