బండి భగీరథ్‍పై పోక్సో కేసు.. బాలిక వివరాలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు నమోదు

by Prasad Jukanti |   (  Updated:2026-05-15 12:29:48  IST  )

పోక్సో కేసుల్లో మైనర్ బాధితుల, వారి కుటుంబాల వివరాలు, ఫోటోలు షేర్ చేయడం తీవ్ర నేరమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు

బండి భగీరథ్‍పై పోక్సో కేసు.. బాలిక వివరాలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారికి పోలీసులు షాకిచ్చారు. సోషల్ మీడియాలో బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రసారం చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ ఫిర్యాదు మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ - సెక్షన్ 74 (మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయడంపై నిషేధం), జువెనైల్ జస్టిస్ యాక్ట్ - సెక్షన్ 74 (మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయడంపై నిషేధం) సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక ఆమె కుటుంబ వివరాలు బహిర్గతం చేసేలా కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలు, సంబంధిత URLల ద్వారా ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విజ్ఞప్తి:

పోక్సో కేసుల్లో బాధితులుగా ఉన్న మైనర్ పిల్లల లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలను, ఫోటోలను ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడించకూడదని, అలా చేయడం అత్యంత తీవ్రమైన చట్టపరమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి చర్యల వల్ల బాధితులు, వారి కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదనకు, అవమానానికి గురవుతారని తెలిపారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు ప్రజలకు, సోషల్ మీడియా వినియోగదారులకు కీలక విజ్ఞప్తి చేశారు. బాధితురాలి గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని, ఫోటోలను షేర్ చేయవద్దని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

POCSO Case: బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. కోర్టు సంచలన ఉత్తర్వులు

Next Story