- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
POCSO Case: బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. కోర్టు సంచలన ఉత్తర్వులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న రాజకీయ ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది.

దిశ వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న రాజకీయ ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బండి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన వ్యవహారంలో భవిష్యత్తులో మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తన పేరు వాడకుండా నిలువరించాలని, అలాగే ఇప్పటివరకు తన పేరుతో సర్క్యూలేట్ అయిన వీడియోలను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిపై నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కాబట్టి ఈ వివాదంలో తన పేరును ఎక్కడా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
స్పందించిన కోర్టు.. ‘బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని వెంటనే ఆపేయండి. ఇప్పటి వరకు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులను, పత్రికా క్లిప్పింగులను, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లను తొలగించండి. ఈనెల 26లోపు ఆయా వీడియో క్లిప్పింగులను, డిజిటల్, పత్రికా కథనాలను, పోస్టర్లను తొలగించకపోతే చర్యలు తప్పవని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై బండి సంజయ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






