- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి.. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి: కేకే
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ మోడీ దగ్గర మొకరిల్లిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. కూతురు కవితను జైలు నుంచి విడిపించడం కోసం ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను కేసీఆరే బీజేపీకి వేయించాడని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలే చెప్పారన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేకే మహేందర్ రెడ్డి.. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ ఉన్నారని, కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని తనను కేసీఆర్ సంప్రదించారని మోడీనే స్వయంగా చెప్పారని దీన్ని బట్టే వీరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కోన్ కిస్కా? అని ప్రశ్నించారు. నీటి విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేసి సిరిసిల్ల జిల్లాలో పంటపొలాలను ఎండబెట్టి కేసీఆర్ తన పొలాలకు నీళ్లు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేశారని ఆరోపించారు.
Read More...