ఉప రాష్ట్రపతి ఎన్నికలపై BRS కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-08 03:45:47  IST  )

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

ఉప రాష్ట్రపతి ఎన్నికలపై BRS కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికల(Vice Presidential Elections) వేళ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నోటా లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ లీడర్లు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్(Congress) లీడర్లు తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదనే భావనకు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాది. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయన్ను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్‌లో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ ఎంపీలు సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి ఉన్నారు.

Read More : రాజకీయాలకు కేసీఆర్ శాశ్వతంగా గుడ్ బై!...20 నెలలుగా ఫాంహౌజ్‌కే పరిమితం

Next Story