శాసనమండలిలో హైడ్రామా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-30 05:29:51  IST  )

తెలంగాణ శాసనమండలి సోమవారం రణరంగంగా మారింది.

శాసనమండలిలో హైడ్రామా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి సోమవారం రణరంగంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సభా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్' వ్యవహారాన్ని లేవనెత్తారు. ఈ సంస్థపై తక్షణమే హౌజ్ కమిటీ వేయాలని, అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకెళ్లారు. నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను నేటి (సోమవారం) రోజంతా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించేశారు. అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం..

బీఆర్ఎస్ సభ్యుల తీరుపై శాసనసభాపక్ష వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైర్మన్ పదేపదే అప్పీల్ చేస్తున్నా వినకుండా, సభ సజావుగా సాగకుండా అడ్డుతగలడం సరికాదని ఆయన సీరియస్ అయ్యారు. ప్రతిపక్షం ఉద్దేశపూర్వక గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్స్.. మండలి వద్ద ఉద్రిక్తత

Next Story