- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్స్.. మండలి వద్ద ఉద్రిక్తత
తెలంగాణ శాసనమండలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్సీలు భారీ నిరసన చేపట్టారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మండలి భవనం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. "మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి", "ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి" అంటూ రాసి ఉన్న ప్లకార్డులతో వచ్చారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగే అర్హత లేదని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో మార్షల్స్ మరియు ఎమ్మెల్సీల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్లకార్డులు ప్రదర్శించొద్దని పదే పదే కోరినప్పటికీ, సభ్యులు వెనక్కి తగ్గకుండా నినాదాలు కొనసాగించారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.
ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీరియస్..
ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని, లేదంటే తమ పోరాటం వీడబోమని స్పష్టం చేశారు. మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సరికాదని వారు ధ్వజమెత్తారు.






