రేవంత్ రెడ్డిని బట్టలూడదీసి కొట్టే పరిస్థితి వస్తుంది: MLA

by GSrikanth |
రేవంత్ రెడ్డిని బట్టలూడదీసి కొట్టే పరిస్థితి వస్తుంది: MLA
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డిది పాదయాత్ర కాదు... కాంగ్రెస్‌కు పాడె గట్టే యాత్ర అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడికి పోతే అక్కడి ఎమ్మెల్యేలను తిడుతున్నాడని.. ఇది పద్ధతి కాదని సూచించారు. రేవంత్ రెడ్డి వృత్తి బ్లాక్ మెయిలింగ్ అని, రేవంత్ రాజకీయ వ్యభిచారి.. ఓ బ్రోకర్అని మండిపడ్డారు. సచివాలయం, అమరవీరుల స్మారక కేంద్రం, బీఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.

సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిలింగ్‌కు వాడుకునే రేవంత్ ఇపుడు కూడా వీటిపై సమాచారం తీసుకోవచ్చు అని సూచించారు. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు ఎక్కడిది అన్నారు. పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. రేవంత్ పిచ్చి మాటలు మానుకోవాలని.. లేకుంటే ప్రయాక్షేత్రంలో బట్టలు ఊడదీసి కొడతారని.. తస్మా త్ జాగ్రత్త అని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Next Story

Most Viewed