టాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌కి ఏ హీరోయన్ లక్కీ హీరోయిన్‌నో తెలుసా?

by Samataha |
టాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌కి ఏ హీరోయన్ లక్కీ హీరోయిన్‌నో తెలుసా?
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో కొందరు దర్శకులకు కొందరు హీరోయిన్స్ లక్కీగా మారిపోతుంటారు. ఎందుకంటే వారు తీసిని సినిమా సక్సెస్ కావడంతో, వారు ఆ హీరోయిన్‌తో కలిసే మరో సినిమాను తెరకెక్కిస్తారు. ఇక అది కూడా మంచి విజయం సొంతం చేసుకుంటే, ఆ దర్శకుడికి ఆ హీరోయిన్ లక్కీ గర్ల్ అయిపోయినట్లే. ఎందుకంటే చిత్రపరిశ్రమలో విజయం అందుకోవడం కష్టం, బడ్జెట్ ఎక్కువగా పెట్టి, సినిమా సక్సెస్ అవుతుందని భావించిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయి. అందుకే వారు లక్కును కూడా నమ్ముకుంటారు. అయితే మరి మన టాలీవుడ్‌లో ఏ దర్శకుడికి ఏ హీరోయిన్ లక్కీ హీరోయిన్‌నో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

త్రివిక్రమ్ : జల్సా సినిమా విడుదలై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా ఇలియానా, త్రివిక్రమ్‌కు లక్కీ హీరోయిన్ అయిపోయింది. వీరి కాంబినేషన్‌లో జులాయి, జల్సా,చిత్రాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా త్రివిక్రమ్‌కు సమంత కూడా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. వీరి కాంబోలో, సన్నాఫ్ సత్తమూర్తి, అ..ఆ, అత్తారింటికి దారేది చిత్రాలు రాగా, మూడు సూపర్ హిట్ అందుకున్నాయి.

రాజమౌళి : దర్శక ధీరు రాజమౌళికి అనుష్క లక్కీ హీరోయిన్ అంట. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన బాహుబలి,బాహుబలి2, విక్రమార్కుడు రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.

అనిల్ రావుపూడి, హరీష్ శంకర్ : అనిల్ రావిపూడికి మెహ్రీన్ లక్కీ హీరోయిన్. ఎందుకంటే వీరి కాంబోలో రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 రాగా, ఎఫ్ 3 కాస్త పరవాలేదు అనిపించినా మిగితా రెండు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక హరీష్ శంకర్‌కు పూజా లక్కీ హీరోయిన్. వీరి కాంబోలో గద్దల కొండ గణేష్, డీజే సినిమాలు రాగా, రెండు పర్వాలేదు అనిపించాయి.

శేఖర్ కమ్ముల : సాయి పల్లవి డైరెక్టర్ శేఖర్ కమ్ములకు లక్కీ హీరోయిన్ అని చెప్పొచ్చు. వీరి కాంబోలో ఫిదా చిత్రం రాగా, ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే లవ్ స్టోరీ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. అలాగే అజయ్ భూపతికి ఆరెక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ లక్కీ హీరోయిన్ కాగా, పూరి జగన్నాథ్‌కు ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షిత లక్కీ హీరోయిన్ అంట.

Next Story

Most Viewed