నాకు సెక్స్ అంటే పిచ్చి, కాలేజీ వదిలేసి ఆ వీధుల్లో తిరిగానంటున్న RGV!

by Samataha |
నాకు సెక్స్ అంటే పిచ్చి, కాలేజీ వదిలేసి ఆ వీధుల్లో తిరిగానంటున్న RGV!
X

దిశ, సినిమా : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వివాదాలు సృష్టించడమే కాకుండా వాటికి వివరణ ఇవ్వడంలో కూడా ఆయనకు మించిన తోపు లేరన్నది వాస్తవం. ఇక ఆర్జీవీ చాలా గ్రేట్ అంటారు ఆయన అభిమానులు. ఎందుకంటే? ఎలాంటి భయం లేకుండా, దేని గురించి ఓపెన్‌గా చెప్పాలో, దేని గురించి పబ్లిక్‌గా మాట్లాడకూడదో అలాంటి వాటిని ఏవీ పట్టించుకోడు. తనకు నచ్చింది నచ్చినట్లుగా చేయడమే కాకుండా, చాలా ఓపెన్‌గా బోల్డ్ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా కాంట్రవర్సీలు చేయడంలో ఈయన ముందు ఉంటాడు.

ఎవరు ఏమన్నా, విమర్శించిన పట్టించుకోకుండా తనకు నచ్చింది నచ్చినట్లు చేస్తుంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఓపెన్‌గా సమాధానం ఇచ్చారు. స్నేహం, సెక్స్, ప్రేమలో మీ ఎంపిక ఏంటీ అడిగితే ఓపెన్‌గా.. నాకు సెక్స్ అటే పిచ్చి నేను అదే కోరుకుంటాను అని ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ.. నేను కాలేజీకి కూడా వెళ్లే వాడిని కాదు, విజయవాడ వీధుల్లో విచ్చల విడిగా తిరిగాను, సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం, అలాగే మా మామయ్య సినిమా విళ్లేషణ నాకు రుచి చూపించారు. నేను నాకు నచ్చిన పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతాను, నాకు నచ్చినట్లుగా ఉంటాను అంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed