ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయిన కల్కి.. అదిరిపోయిందిగా!

by Kavitha |
ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయిన కల్కి.. అదిరిపోయిందిగా!
X

దిశ, సినిమా: ఏంటి టైటిల్ చూడగానే గుండె ఆగిపోయినంత పనైందా.. అసలు ఓటీటీకి కల్కి రావడం ఏంటి.. ఏం మాట్లాడుతున్నారా.. నరాలు కట్ అయిపోయాయి అని అనిపిస్తుందా.. అలా అనిపించడంలో తప్పు లేదులే ఎందుకంటే టైటిల్ అలాంటిది మరి.

కల్కి ఓటీటీలోకి వచ్చిన విషయం నిజమే.. కానీ, ప్రభాస్ కల్కి 2898 AD అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన చిత్రం కల్కి. ఇది 2019 లో రిలీజ్ అయిన ఒక మలయాళ సినిమా. ఇన్నేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ తో ఓటీటీలోకి వచ్చింది. ప్రవీణ్ ప్రభారమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లిటిల్ బిగ్ ఫిలిమ్స్ కింద సువిన్ కె. వర్కీ మరియు ప్రశోభ్ కృష్ణ నిర్మించారు. ఈ చిత్రంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించగా, శివజిత్ పద్మనాభన్, సంయుక్త మీనన్ మరియు వినీ విశ్వ లాల్ కీలకమైన సహాయ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

పొలిటికల్ టచ్ తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక కల్కి అనే పోలీసాఫీసర్ పాత్రలో తొవినో అదరగొట్టాడు. ఇక సినిమా మొత్తం యాక్షన్ తో నింపేసాడు డైరెక్టర్. పవర్ ఫుల్ పోలీస్ గా టోవినో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సంయుక్త పాత్ర అసలు అంత ముఖ్యమైనది కాదు. కానీ అప్పట్లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండడంతోనే ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఒక గ్రామాన్ని వేదించే రౌడీ.. పోలీస్ గా వచ్చిన హీరో. అతడి అంతు చూడడం.. కథ మొత్తం ఇలాగే నడిచింది టోవినో యాక్టింగ్ కోసం చూడాలంటే ఈ సినిమా ఈటీవీ విన్ లో చూడొచ్చు.

Next Story

Most Viewed