పొలం గట్ల మీద అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ రతిక.. (వీడియో)

by Hamsa |
పొలం గట్ల మీద అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ రతిక.. (వీడియో)
X

దిశ, సినిమా: పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రతికా రోజు.. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు బిగ్‌బాస్ హౌస్‌లో డిఫరెంట్ షేడ్స్ చూపించడంతో పాటుగా.. అందాలతో కుర్రాళ్లను మైమరిపించింది. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్‌తో సన్నిహితంగా ఉంటూనే అతనితో గొడవలు పడి రివర్స్ అయింది. ఈ క్రమంలో.. రతిక ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. కొద్ది రోజులకే ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. కానీ మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది.

12 వారంలో ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా బుల్లితెరపై షోస్ కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి తన హాట్ ఫొటోలతో యూత్‌కు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, రతికా రోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. అందులో చీర కట్టి రెండు జడలు వేసి సైకిల్‌పై కూర్చుని బీడు తాగుతూ కనిపించింది. పుష్ప-2 సెకండ్ సాంగ్ సూసేకి అగ్గిపుల్ల అనే సాంగ్‌కు రీల్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన వారు సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed