- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Assembly : అల్లుడికి హాఫ్.. మామకు ‘ఫుల్లు’ నాలెడ్జ్.. KCR, హరీష్ రావులపై సీఎం రేవంత్ పంచ్‌లు
by Sathputhe Rajesh |
తెలంగాణ శాసనసభలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై వాడీ వేడీ చర్చ కొనసాగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై వాడీ వేడీ చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి పంచ్‌లు వేశారు. 2017 జనవరి 4న ఆనాటి సీఎం కేసీఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సభలో అబద్ధాలు చెబుతున్న హరీష్ రావుకు తన వద్ద సమాచారాన్ని పంపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పినట్లు హరీష్ రావుకు హాఫ్ నాలెడ్జ్ అని.. పెద్దాయనకు ‘ఫుల్లు’ నాలెడ్జ్ అంటూ చేతితో ఫుల్ బాటిల్ సైగ చేస్తూ సీఎం చూయించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. సభలో వాస్తవాలే మాట్లాడాలని సీఎం హరీష్ రావును కోరారు.
Next Story






